ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పంచి నీచానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 75ఏళ్ల వద్ధురాలి భర్త 22 రోజుల క్రితమే మరణించాడు.
అప్పటినుంచి ఆస్తి తన పేరున రాయాలంటూ ఆమె 50 ఏళ్ల కుమారుడు తల్లిని పీక్కుతినడం మొదలెట్టాడు. ఈ క్రమంలో మే 13న పనిలో నిమగ్నమైన తల్లిపై ఏదో ద్రవ పదార్థం చల్లాడు. దీంతో ఆమె చర్మంపై దురద మొదలవగా, వెంటనే స్నానానికి వెళ్లి బట్టలు మార్చుకుంది. దీన్నంతటినీ ఆమె కుమారుడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు.