రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఓ మహిళ తన ప్రియుడి మాటలు విని నిద్రపోతున్న కన్నబిడ్డను తీసుకెళ్లి సరస్సులో పడేసింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలిగి తీసి విచారణ చేపట్టారు.
దీంతో పాప లేకుండా చూడాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి మాటలు విన్న కన్నతల్లి తన బిడ్డను రాత్రిపూట సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్పింది. ఆ తర్వాత ఆ బిడ్డ నిద్రపోవడంతో నీటి సరసులో పడేసి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళినట్టు పోలీసుల విచారణలో వెల్లడించింది.