ఇప్పటికే రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్వామి.. శుక్రవారం మరోమారు విమర్శలు గుప్పించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు పనికిరారని చెప్పారు. విద్యాధికులైన తమిళ ప్రజలు, అంతగా చదువుకోని రజనీకాంత్‌ని సీఎంగా చూడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరన్నారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్టానం ఇష్టమని స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో చేసిన ట్వీట్‌లో రజనీ కర్నాటకలో పుట్టి.. మహారాష్ట్రలో పెరిగారని, అందువల్ల ఆయన బేసిగ్గా తమిళుడు కాదంటూ పేర్కొన్న విషయం తెల్సిందే.