ఈ క్రిస్మస్ సమాజంలో సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు వెల్లడించారు.
అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ చర్చిలో ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. చర్చిలో ప్రార్థనలకు క్రిస్టియన్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని చర్చిల్లో అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ గీతాలు అలరిస్తున్నాయి.