అమర్‌ సింగ్‌ లేకపోతే జైలుకెళ్లేవాడిని... ములాయం సింగ్

మంగళవారం, 25 అక్టోబరు 2016 (08:36 IST)
సొంత పార్టీలోనే కాదు... ఏకంగా తండ్రీతనయుల మధ్య చిచ్చు పెట్టిన ఎస్పీ నేత అమర్ సింగ్‌ను ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ వెనుకేసుకొచ్చారు. అమర్ సింగ్ తన సోదరుడని, అమర్‌సింగ్‌ తనకు ఎంతో సహాయం చేశారని, తాను జైలుకు వెళ్లకుండా ఆయన అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే... తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను ఆయన మాస్‌ లీడర్‌గా అభివర్ణించారు. వారిద్దరినీ వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 'కుటుంబంలో విభేదాలు దురదృష్టకరం. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు మనం మన బలహీనతలపై పోరాడడానికి బదులుగా మనలో మనమే కొట్లాడుకుంటున్నాం. నాకు, పార్టీకి శివపాల్‌, అమర్‌ సింగ్‌ చేసిన సేవలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమర్‌ సింగే కనుక లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. ఆయన నాకు సోదరుడితో సమానం. ఆయన చేసిన పాపాలన్నిటినీ ఎప్పుడో క్షమించేశానని స్పష్టం చేశాడు. 
 
ఇకపోతే.. శివపాల్‌ మాస్‌ లీడర్‌. పార్టీకి ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అసలు నీ దమ్మెంత!? ఎన్నికల్లో నువ్వు గెలవగలవా!? కొంతమంది మంత్రులు భజనపరులుగా మారారు. తాగుబోతులను, రౌడీలను పార్టీలోకి తీసుకొచ్చావు. అధికారంలో ఉన్నవాళ్లకు లిక్కర్‌ మాఫియా అండగా నిలుస్తోంది. అమర్‌సింగ్‌ను నువ్వు తిడుతూనే ఉన్నావు. పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నాయకులు ఒకరినొకరు కొట్టుకోవద్దు అని హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి