సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:23 IST)
జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడాన్ని విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. 
 
ఆర్టికల్ 370  రద్దు చారిత్రాత్మక నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు అభినందనీయులు అంటూ ప్రశంసించారు. జమ్ముకశ్మీర్ లో ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
కశ్మీర్ లోని సరస్వతీ శక్తిపీఠం పునరుద్ధరణకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. దేశంలోని శక్తి పీఠాలన్నింటిని దర్శించే అవకాశం దక్కుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు