ఉత్తర బెంగుళూరులోని కళ్యాణ్ నగర్‌లో సెకండ్ వైఫ్ అనే ఒక రెస్టారెంట్‌ను కొత్తగా ఏర్పాటుచేశారు. అదే వీధిలో ఆంధ్ర నుంచి ఒక నూతన దంపతులు కాపురం చేరారు. కొత్తగా పెళ్ళవ్వడంతో భర్తతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్ళాలనుకుంది భార్య. భార్య శిరీష తన భర్త రాజును రెస్టారెంట్‌కు తీసుకెళ్ళమని కోరింది. దీంతో వెంటనే భర్త సెకండ్ వైఫ్ హోటల్‌కు వెళదామంటూ చెప్పాడు. దీంతో ఆ భార్యకు చిర్రెత్తుకొచ్చిందట.
సెకండ్ వైఫ్ హోటల్ ఏంటి అంటూ అంతెత్తు లేచి పడిందట. అసలు విషయం చెప్పేలోపే శిరీషకు కోపంతో ఊగిపోయిందట. రాజు వెంటనే నీకు దణ్ణం పెడతా సెకండ్ వైఫ్ అనేది రెస్టారెంట్ పేరు. ఆంధ్రా రుచులతో అక్కడి వారు ఇక్కడ కొత్తగా రెస్టారెంట్ పెట్టారు అని చెప్పారట. అయినా సరే భార్య నమ్మకపోవడంతో ఆ రెస్టారెంట్‍కు వెళ్ళి చూపించాడట. అప్పుడు శిరీషకు అర్థమైందట. ఇలా చాలామంది సెకండ్ వైఫ్ రెస్టారెంట్ పేరు చెప్పి వారి సతీమణుల దగ్గర అడ్డంగా బుక్కయిపోతున్నారట.