ప్రస్తుతం షీలా సీఎం సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారు. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. షీలా బాలాకృష్ణన్ సన్నిహితులు మాత్రం ఆమె రాజీనామా నిర్ణయం నిజమేనని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి షీలా బాలాకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకుముందే పదవి నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం షీలాను కోరినట్టుగా సమాచారం.
జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంవో కార్యాలయం ఇప్పటికే తొలగించిన నేపథ్యంలో.. షీలా బాలాకృష్ణన్ ను కూడా అదే దారిలో సాగనంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.