సింగపూర్‌లో భర్త.. ప్రియుడితో భార్య సల్లాపాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది..

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (11:39 IST)
పెళ్లైనా.. భర్త వద్దన్న ప్రియుడితో సంబంధాలు తెంచుకోలేదు.. ఆ మహిళ. భార్య ఎంత చెప్పినా మారకపోవడంతో విసిగిపోయాడు భర్త. అందుకే ప్రియుడితో భార్య కలసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచాడు భర్త, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ముక్కనూరు గ్రామానికి చెందిన కుమార్‌కు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. అయితే వీరికి ఐదేళ్ళ కుమార్తె కూడా ఉంది. 
 
వివాహమైన కొద్దిరోజుల్లోనే కుమార్ సింగపూరుకు వెళ్లాడు. అయితే భర్త సింగపూర్‌కు వెళ్ళగానే భార్యకు అదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం సింగపూర్‌లోని కుమార్‌కు తెలిసింది. స్వంత గ్రామానికి వచ్చిన కుమార్ ప్రియుడితో ఉన్న సంబంధాన్ని వదులుకోవాలని భార్యన హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. 
 
దీంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో సింగపూరుకు వెళ్లని కుమార్.. ప్రియుడితో భార్య ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి