జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దాగివున్న ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడపడుతున్న భద్రతా దళాలను బందీపొరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిపింది. శుక్రవారం ఉదయం ఆర్మీ పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.
పహల్గాంలో ఉగ్రవాది వెనుక లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్‌లో చురుగ్గా పని చేస్తున్న మాడ్యూల్‌ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటుచేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు.