ఆ ముగ్గురి కోసం బోయింగ్ 747 విమానాలు - ఖజానాపై భారం రూ.8458 కోట్లు

బుధవారం, 3 జూన్ 2020 (21:46 IST)
ఆయా దేశాలకు చెందిన దేశాధినేతలు ప్రయాణించేందుకు ప్రత్యేక విమానాలు ఉంటాయి. అలాగే, భారతదేశాధినేతలు ప్రయాణించేందుకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా బోయింగ్ 777 విమానాలను వాడుతున్నారు. వీటి స్థానంలో బోయింగ్ 747 విమానాలను వినియోగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కోసం స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ల(ఎస్ఈఎస్ఎఫ్)ను ఎయిరిండియా సమకూర్చనుంది. ఈ రెండు విమానాల కోసం రూ.8458 కోట్లను ఖర్చు చేయనున్నారు. 
 
కేంద్ర వర్గాల సమాచారం మేరకు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బోయింగ్ 777 - 300ఈఆర్ విమానాల స్థానంలో బోయింగ్ 747 విమానాలను మార్చనుంది. ఈ విమానాలను రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ వంటి వీవీఐపీలు ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. ఈ విమానాల్లో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, క్యాబిన్ కాన్ఫిగరేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు