చంద్రయాన్-3 ప్రయోగం.. అదే రోజు క్యాన్సర్ వున్నట్లు తేలింది..?

సెల్వి

మంగళవారం, 5 మార్చి 2024 (11:25 IST)
ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, క్యాన్సర్ నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చారు. కడుపులో కణితి పెరిగిందని, ఈ తరహా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చిందని సోమనాథ్ వెల్లడించారు. 
 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్1 మిషన్ ను ప్రయోగించింది. అయితే, అదే రోజున తాను క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం నిర్ధారణ అయిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పుకొచ్చారు. 
 
చంద్రయాన్-3 ప్రయోగం సమయంలోనే అనారోగ్య సమస్యలు తలెత్తడాన్ని గుర్తించాను. అయితే అందుకు కారణం తెలియరాలేదు. ఆ రోజున వైద్య పరీక్షలు చేయించుకున్నానని.. క్యాన్సర్ వున్నట్లు ఆ రోజే నిర్ధారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. 
 
తనకు క్యాన్సర్ అని తెలియగానే తన కుటుంబం, తన ఉద్యోగ సహచరులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నా. కీమోథెరపీ చికిత్స కూడా జరిగింది. తొలుత భయపడ్డానని.. తాను ఆస్పత్రిలో వున్నది మాత్రం నాలుగు రోజులేనని సోమనాథ్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు