ప్రాణం తీసిన గజ ఈతగాడి దురాశ.. నీటిలో మునిగిన వ్యక్తిని పాడేందుకు రూ.10 వేలు డిమాండ్..

ఠాగూర్

సోమవారం, 2 సెప్టెంబరు 2024 (18:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ గజ ఈతగాడి దురాశ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నీటిలో మునిగిన వ్యక్తిని కాపాడేందుకు గజ ఈతగాడు రూ.10 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తేగానీ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించబోనని తేల్చి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానానికి వెళ్లారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు. దాంతో ఆదిత్య వర్ధన్ మిత్రులు తమకు ఈత రాకపోవడంతో అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కశ్యప్ సాయం కోరారు. అందుకు అతడు రూ.10 వేలు డిమాండ్ చేశాడు. 
 
అందుకు అంగీకరించిన స్నేహితులు తమ వద్ద క్యాష్ లేకపోవడంతో ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు. దాంతో ఆన్‌‍లైన్‌లో రూ.10వేలు తనకు బదిలీ అయ్యే వరకు తాను నీటిలో దూకబోనని తేల్చి చెప్పాడు. ఆదిత్య వర్ధన్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే.. తనకు రావాల్సిన నగదు బదిలీ అయ్యే వరకు సునీల్ అలాగే వేచి చూశాడు. అయితే, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అయ్యేలోపు అధికారి నీటిలో మునిగి చనిపోయారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు