శిశకళ కోసం ఆర్కే నగర్‌లో విజయశాంతి ఎన్నికల పర్యటన

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (21:24 IST)
రాములమ్మ విజయశాంతి తెలంగాణ నుంచి తమిళనాడు చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం ఎన్నికల ర్యాలీ కోసం వచ్చారు. శశికళ జైలులో వుండటంతో ఆమె ప్రచారం చేసే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు ఆర్కే నగర్ నియోజకవర్గం అమ్మ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో శశికళ వర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాగైనా విజయం సాధించాలన్న ధ్యేయంతో ముందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. విపరీతంగా డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న దినకర్‌ను గెలిపించేందుకు సినీ హీరోహీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. గురువారం నాడు నటుడు శరత్ కుమార్ నియోజకవర్గంలో పర్యటించి దినకర్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే ఈరోజు తెలంగాణ నుంచి రాములమ్మ విజయశాంతి ఆర్కే నగర్ నియోజకవర్గంలో పర్యటించి శశికళ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇకపోతే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం అమ్మ జయలలిత శవపేటిక నమూనాతో ఎన్నికల ర్యాలీ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి