పక్కలో భార్యను ఏ శ్రీదేవిగానో, ఏ రకుల్ గానో ఊహించుకుని ఆ ఊహలు నిజంకాక భార్య తన భార్యగానే అనాకారిగా కనిపించడంతో ద్వేషం పెంచుకుని జీవిత బంధాలనే తుంచేసుకునే మగాళ్లు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తారు. ముఖం గుండ్రంగా ఉంటేనో, తెల్లగా ఉంటేనో భార్య అప్సరస అని, నల్లగా ఉంటే శూర్పణఖ అని ముందే కల్పించుతున్న అహగాహనలు దాంపత్యం బంధాలను నిలువునా చీరేస్తుంటాయి. కాని తన భార్య అందంగా లేదనే భావాలు పురుషులే వస్తాయా. తమ భర్తలు అందంగా లేరనే ఆలోచనలు ఆడవారికి రావా అనే ప్రశ్న చాలామందికి తట్టే ఉంటుంది. కడలూరి అమ్మాయి అలాంటి ఉదంతాలు ఉన్నాయని మన కళ్ల ముందు సాక్షీభూతంగా నిలుస్తోంది.
కట్టుకున్న భర్త అందంగా లేడనే కారణంగా పెళ్లైన వారానికే అతడిని హత్య చేసిన భార్య కథ ఇది. తమిళనాడులోని కడలూరులో 22ఏళ్ల యువతికి స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తితో వారం క్రితమే పెద్దలు వివాహం చేశారు. అంతా బాగానే ఉంది కానీ యువతి తరపు బంధువులు, స్నేహితులు ఆమె భర్త అందంగా లేడని, సరిజోడి కాదని హేళన చేయడంతో ఆమె మనస్తాపానికి గురైంది.
దీంతో సోమవారం రాత్రి సదరు యువతి భర్తతో వాగ్వివాదానికి దిగింది. కోపంతో వూగిపోయిన ఆమె భర్త తలపై గ్రైండర్ రాయితో కొట్టి చంపేసింది. అనంతరం ఏమీ ఎరగనట్టు తన భర్తను ఎవరో చంపేశారని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించే సరికి అసలు విషయం బయటపడింది. పోలీసులు యువతిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరచగా ఆమెను రిమాండ్‌కు తరలించారు.
వందేళ్ల తర్వాత మన దేశ మహిళల్లో భర్త అందంగా లేడని స్నేహితులు హేళన చేస్తే కట్టుకున్న భర్తను గ్రైండర్ రాయితో కొట్టి చంపిన ఘటన సమాజ పురోగతిలో భాగంగా చూడాలా. అందం పట్ల ఈ దేశంలో మగాల్లూ, ఆడవారూ కూడా ఒకేరకమైన తప్పుడు చైతన్యలో ఉంటూ బతికేస్తున్నారనుకోవాలా?