అయితే, మనస్ఫర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా నివశిస్తున్నారు. ఈ క్రమంలో లత తన కుమారుడితో కలసి ఉంటోంది. కళాశాలకు వెళ్లే సమయంలో లత కుమారుడిని అదే ప్రాంతంలో ఉన్న పుట్టింట్లో వదిలి వెళుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మనుమడు, లత ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆమె తండ్రి లత ఇంటికి వెళ్లాడు.
అతను వెళ్లి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి. దాంతో అతను చుట్టుపక్కల వారి సాయంతో లోనికి వెళ్లి చూశాడు. శరీరం కాలిన స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ కమిషనర్ సుందర్ రాజన్ నేతృత్వంలోని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మరో గదిలో బంధించిన ఆమె కుమారుడిని విడిపించారు.