ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన మనసుకు నచ్చిన ఓ యువకుడితో మూడేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఈ విషయం తమ ఇంట్లో తెలిసింది. దీంతో వారు మందలించారు. ఈ విషయాన్ని తన యువకుడి వద్ద చెప్పి... పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తెచ్చింది. కానీ, ఆ ప్రియుడు మాత్రం పెళ్లి మాటెత్తకానే ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. మహిళా టెక్కీని గొంతునులిమి హత్యచేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఉన్న బద్లాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
అయితే, ఈ వ్యవహారం పూనం కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు దీనిని వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఝార్కడ్‌కు పూనం చెప్పింది. తమ అనుబంధం కొనసాగాలంటే పెళ్లి చేసుకోకతప్పదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది.
ఆ ఆవేశంలో పూనం చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి తన స్నేహితుడి ఇంటికి పారిపోయాడు. ఈ విషయం తన స్నేహితుడికి చెప్పడంతో, అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.