కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ప్రైవేట్ కంపెనీలు ఆమోదం తెలిపాయి. ఈ కొత్త చట్టం మేరకు మూలాధన వేతనం (బేసిక్ పే) కంటే ఇతర ఇలవెన్సులు అధికంగా ఉంటే మాత్రం వేతనంలో కోతపడనుంది. అంటే జీతంలో 10 నుంచి 12శాతం తగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ కొత్త వేతన సవరణ చట్టం ఈ యేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.
అలాగే, ప్రావిడెంట్ ఫండ్ కోసం ఉద్యోగి చెల్లించాల్సిన మొత్తం కూడా పెరగక తప్పదు. ఈ సర్దుబాటుల కారణంగా ప్రతి నెలా ఇంటికి తీసుకెళ్లే జీతంలో ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ, పదవీ విరమణ తర్వాత పొందే మొత్తం భారీగా వస్తుంది.
కొత్త వేతన సవరణ చట్టం ప్రకారం జీతాల చెల్లింపు విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నది. వీటి ప్రభావం ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా ప్రైవేట్ రంగంపై ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతంలో బేసిక్ పే 50 శాతం కంటే తక్కువగా ఇతర అలవెన్సులు ఎక్కువగా ఉంటున్నాయి.