మిరియాలు, ఉలవలు కలిపి మటన్ కాళ్ల సూప్ చేస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ సూప్‌లో ఉండే గ్లూకోసమైనన్, కొండ్రోయిటిన్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
మటన్ సూప్ తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ఎముకలు బలపడతాయి. మిరియాలతో మటన్ సూప్ తాగితే ఛాతీ నొప్పి, దగ్గు సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలం, చలికాలంలో, మటన్ సూప్ జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కానీ ఇప్పటికే బరువు తక్కువగా ఉన్నవారు తినే ముందు మటన్ సూప్ తాగకూడదు. మటన్ సూప్‌లోని ఫాస్పరస్, క్యాల్షియం దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మటన్ సూప్‌లో తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.