అమ్మవారికి స్తోత్రం అంటే ప్రీతి.. శుక్రవారం ఇలా చేస్తే..?

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (05:00 IST)
అమ్మవారిని స్తోత్రించిన వారికి అభీష్ట సిద్ధి లభిస్తుంది. ఒక్కొక్క దేవతకీ ఒక్కొక్కటీ ప్రీతి. శివునికి అభిషేకం, విష్ణువునకు అలంకారం, సూర్యునికి నమస్కారం, గణపతికి తర్పణము, అమ్మవారికి స్తోత్రము ప్రీతికరం. అందుకే తల్లికి స్తోత్రముల చేత అభినందించి ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అందుకే "స్తుతా దిశసి కామం'' స్తోత్రం చేత సర్వాభీష్టాలు కలుగుతాయి. అలాగే పాపాలను ఈ స్తోత్రం పోగొడుతుంది. 
 
అలాగే కోరిన కోరికలు నెరవేరాలంటే శుక్రవారమే కాకుండా ప్రతి రోజూ 108 సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి. స్తోత్రములు అమ్మవారి మహిమ, గుణము, లీల, రూపము, తత్త్వము చెప్పబడుతున్నాయి. వాటిని స్తోత్ర రూపంలో పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి. అలాగే స్మరణ అనేది మనస్సుకు సంబంధించినది కనుక స్మరణ చేస్తే పాపాలు నశించి పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
అలాగే ఐశ్వర్య సిద్ధికి శ్రీ సూక్తం విశేష ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ అర్చనలో ఉచ్చరించే పరమశుద్ధ మంత్రాలు శ్రీసూక్తం. ఇవి అధర్వణ వేదంలో మంత్రాలు. రుగ్వేదంలో కూడా దర్శనమిస్తాయి. ప్రతిదినం భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ఆజ్యం వేల్చి హారతులిస్తే లక్ష్మీ అనుగ్రహం సత్వరం కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు