పుష్య పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం.. లక్ష్మీ పూజ చేస్తే?

గురువారం, 28 జనవరి 2021 (12:16 IST)
పుష్య పౌర్ణమి నేడు (జనవరి 28). ఈ రోజున సాయంత్రం పూట సత్యనారాయణ పూజ లేదా వ్రతం, లక్ష్మీపూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అంతేగాకుండా తులసీ పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మిని నిష్ఠతో పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి నేతి దీపం వెలిగించడంతో పాటు తెలుపు పువ్వులతో పూజించాలి. 
 
తులసీ కోట ముందు దీపం వెలిగించి.. తులసీ పూజ చేయడం ద్వారా శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శివాభిషేకం చేయించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఉసిరి కాయలపై ఆవు నేతితో తడిరిన వత్తులను వుంచి దీపాలను వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే జనవరి 28 గురువారం నాడు ఈ ఏడాది మొదటి గురుపుష్య యోగం సంభవించనుంది. అయితే జనవరి 1న కొంచెం సేపు ఈ యోగం ఘడియలు ఉన్నాయి. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగాన్ని అత్యంత అరుదైన, ఉత్తమమై యోగాల్లో ఒకటిగా చెబుతారు. గ్రహాలకు గురువుగా బృహస్పతిని, పుష్య నక్షత్రాన్ని ప్రధాన దేవతగా పరిగణిస్తారు. గురువారం నాడు పుష్య నక్ష్తత్రం సంయోగం ఏర్పడుతుంది. ఇది శుభకరమైన యోగాలను తీసుకురానుంది. 
 
పౌర్ణమి రోజు గురుపుష్య యోగం వల్ల ఆధ్యాత్మిక, ధార్మిక సంపద వృద్ధికి పవిత్రమైంది. గురుపుష్య యోగాతో పాటు సర్వార్ధ సిద్ధి అనే శుభయోగం కూడా ఈ రోజున ఉంటుంది. ఈ కారణంగా నేటి ప్రాముఖ్యత చాలా రెట్లు పెరిగింది. ఈ అరుదైన కలయికపై సంపద పెంచడానికి మీరు కొన్ని చర్యలు తీసుకుంటే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
పుష్య పౌర్ణమి నాడు గురుపుష్య యోగం రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ రోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించే మంచి జరుగుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మీకి తామర పూలు, తెలుపు రంగు మిఠాయిలు సమర్పించండి. తామర మాలతో 108 సార్లు "ఓం శ్రీ హ్రీ దారిదేరవినాశిన్యే ధనధాన్య సమృద్ధి దేహీ దేహీ నమః" అనే మంత్రాన్ని జపించండి. ఫలితంగా ధనం ప్రాప్తించడమే కాకుండా ధనవంతులవుతారు. అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి శుభాలు చేకూరుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు