భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది ముక్కనుమ. ఈ పండుగ శనివారం రోజున తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.