శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పులు చేపడతారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రతికూల పరిస్థితులున్నాయి. శనివారం ఊహించని సంఘటనలెదురవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి. ప్రత్యర్థులు, అపరిచితులతో జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు మూలక ధనం అందుతుంది. బంధువులు మీ సహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. అవకాశాలు చేజారిపోతుంటాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, సోమ వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అయినవారితో పట్టింపులెదుర్కుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. శ్రమాధిక్యతో పనులు పూర్తిచేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. దంపతుల మధ్య అవగాహన లోపం. సౌమ్యంగా సమస్యలు పరష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల తీరు బాధిస్తుంది. అధికారులకు హోదా మార్పున స్ధానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మంగళ, బుధ వారాల్లో పనులు అర్ధాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యవహారానుకూలత ఉంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఆరోగ్యం స్ధిరంగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్ధాపనకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం, సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. మంగళ, శని వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదాపడతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం. దైవ, సామాజిక కార్యక్రమాంల్లో పాల్గొంటారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఆత్మీయుల సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు ముందుకు సాగవు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. శనివారం ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షీంచుకుంటారు. భాగస్వామిక చర్యలు కొలిక్కి వస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరషాడ 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంత మెుత్తం ధనం అందుతుంది. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
ఈ వారం అనుకూలదాయకమే. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు చేపడతారు. ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. ధనలాభం ఉంది. సమస్యలు సద్దుమణుగుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి.
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆది, సోమ వారాల్లో బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది. రుణ యత్నాలు ఫలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధకి మరింతగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాదాలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుమిత్రులకు మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మంగళ, బుధ వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫనిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం.