మనం రోజూ దుస్తులు ధరించి అందులో ఖర్చీఫ్, ఫోన్స్, పర్స్, ప్యాకెట్ దువ్వెనలను తీసుకెళుతుంటాం. కానీ కొన్ని జేబులో ఉంటే దరిద్రం మన వెంటే తిరుగుతూ ఉంటుందట. అదే పర్స్. పర్స్ చినిగిపోయిన తరువాత కూడా అలాగే వాడితే మనకు దరిద్రం పట్టుకుంటుందట. కొంతమంది పర్సు చినిగిపోయినా అచ్చొచ్చిందని అలాగే వాడుతుంటారు. కానీ అది మంచిది కాదట. చిరిగిపోయిన పర్సును వెంటనే మార్చేయాలట.
అలాగే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టిన తరువాత జేబులో పెట్టుకోవడం అలవాటు. కానీ అలా పెట్టుకోకూదట. వాటి కారణంగా చెడు ప్రభావం కలుగుతుందట. అంతేకాదు అదృష్టం బదులు దురదృష్టమే మన వెంట తిరుగుతుందట. అంతేకాదు డబ్బులను జేబులో చిందర వందరగా పెట్టుకోకూడదట. మడత పడినా కొంతమంది అలాగే నోటును పెట్టుకుంటారు.
కానీ అలా మడిచిన నోటు, చిందరవందరగా పెట్టుకోవడం అస్సలు మంచిది కాదట. అంతేకాదు కొంతమంది జర్నీ చేసే సమయంలో తినుబండారాలు కొంటూ ఉంటారు. మిగిలిన వాటిని జేబులో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడే అవకాశం కూడా వస్తుందట.