"రోడ్డు పైన అందమైన యువతి నడుచుకుంటూ వెళుతుంది. ఆమెను ఒకడు చూసి పెళ్లాడాలనుకుంటాడు. కానీ ఆమెను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు తమ కుమార్తెకి యోగ్యుడైన వరుడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కదా. మరైతే ఇతనెవరు... ఆమెను చూడగానే పెళ్లి చేసుకోవడానికి. ఆమె నాకే సొంతం అని ఎవడైతే అనుకుంటాడో అతడిది ప్రేమ కాదు కామం. ఈ కామం కారణంగా తను ఆ యువతిని ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు. కనుక ఎవరైతే చెడు దృష్టికోణంలోకి వెళ్తున్నామని అనిపిస్తుందో వెంటనే మార్చుకోవాలి''