కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?

సెల్వి

గురువారం, 14 మార్చి 2024 (13:00 IST)
తెల్లవారుజామున దైవారాధన, ధ్యానంతో ఆత్మశాంతి చేకూరుతుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం ఆత్మకు బలాన్ని ఇస్తుందని.. తద్వారా కలియుగంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి మానవజాతి ఉద్ధరించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
రోజూ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం, రుషుల ముహూర్తంలో మేల్కొని దైవారాధన, ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కలియుగంలో ఈ సమయంలో పూజ, ధ్యానం విశేష ఫలితాలను ఇస్తాయి. 
 
ఇంకా అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం చేకూరుతుంది. నవగ్రహాలు, ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో మానవజాతి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలంటే.. ఉదయం పూట పూజతో సాధ్యమని సిద్ధ పురుషులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు