పూర్వజన్మలో ఋణము వుంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణాన్ని బట్టి భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు. అలాగే పిల్లలు పుట్టాలన్న వారి ఋణము మనకు వుండాలి. ఇక ఇంట తిరిగే పశువులు, ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మనకు దక్కవు.
అంతెందుకు ఋణము వుంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది కూడా ఋణానుబంధమే. ఋణమనేది లేకుంటే ఎవరినీ కలలో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు.
ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి. ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి దూరంగా ఉన్నా మన వాళ్లేగా. ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా. వాళ్ల సంతోషం కోరుకోండి. బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ శివయ్యే.