కొన్ని అలవాట్లు ఆధ్యాత్మికపరంగా అమంగళకరమైనవని విశ్వాసం. అవేమిటో తెలుసుకుందాము. భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం. మంచం మీద కూర్చుని భోజనం చేయడం. మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం. స్నానం చేసి విడిచిన బట్టలనే మళ్లీ కట్టుకోవడం.
ఇవే కాకుండా బొట్టు లేకుండా వుండటం, బొట్టు పెట్టుకోకపోవడం. అదే పనిగా కాళ్లను ఊపుతూ వుండటం. ఎవరైనా కాళ్లు చాపుకుని కూర్చుని వుంటే వారి కాళ్లు దాటుకుంటూ నడిచి వెళ్లడం. నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం వంటివి అమంగళకరమైన అలవాట్లుగా చెప్పబడింది.