వాస్తు సరిగ్గా వుంటేనే శ్రీలక్ష్మి ఆ ఇంట నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా కర్పూరంలో లవంగాలను కలిపి హారతి ఇవ్వడం ద్వారా శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలైన ఈ రెండూ లక్ష్మికి చాలా ఇష్టం. ఈ రెండింటిని కలిపి వెలిగించడం ద్వారా ఆ వాసన, పొగ ఇంట్లోని
ప్రతికూలతను తొలగిస్తుందని విశ్వాసం. ఇంకా ఈ రెండింటిని వాసనతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇంకా సంపదన పెరుగుతుంది. ఆదాయానికి మార్గం సుగమమవుతుంది. ఇంకా ఈ రెండింటి వాసన ద్వారా ఇంట్లోని వారికి సానుకూల ఫలితాలు వుంటాయి. కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రిపూట అంటే సంధ్యాకాలం దీపం వెలిగించేటప్పుడు లవంగాలు.. కర్పూరాన్ని వెలిగించడం ద్వారా ఇంట శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్యానుకూలత, తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది. అలాగే కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబంలో ఐక్యత, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.