తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. వయోవృద్ధులకు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వృద్ధులకు అరగంటలోనే శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేలా టిటిడి నిర్ణయం తీసుకుంది. తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4 వేల టోకెన్లను కేటాయించినట్లు టిటిడి తెలిపింది.
ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి మంది, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. వృద్థులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి ఛైర్మన్ కోరుతున్నారు. టిటిడి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.