ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవలను విడుదల చేసిన తితిదే - మొత్తం 56,640 సేవలు

శుక్రవారం, 3 జూన్ 2016 (12:11 IST)
ప్రతినెలా ఆన్‌లైన్‌లో భక్తుల కోసం తితిదే కొన్ని సేవా టికెట్లను విక్రయిస్తోంది. తితిదేకి చెందిన డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. టిటిడి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో ఈ సేవా టికెట్లను విడుదల చేస్తున్నారు. శుక్రవారం కూడా తితిదే సుప్రభాతం, తోమాల, అర్చన, విశేషపూజ, అష్టదళపాదపద్మారాదన, నిజపాదం, కళ్యాణోత్సవం, వూంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, దీపం సేవలను విడుదల చేసింది.
 
జూలై నెలలో ఈ టికెట్లను పొందిన భక్తులు తాము ఎంచుకున్న సేవలలో శ్రీవారిని దర్శిచుకోవచ్చు. మొత్తం సేవలు 56,640మంది టికెట్లను తితిదే విడుదల చేయగా అందులో సుప్రభాతం 6,426, తోమాల 120, అర్చన 120, విశేషపూజ-1497, అష్టదళం-60, నిజపాదం-1859, కళ్యాణం 11,248, వూంజల్‌సేవ-3000, ఆర్జిత బ్రహ్మోత్సవం-6450, వసంతోత్సవం-11,610, దీపం-14250 సేవా టికెట్లను విడుదల చేసింది. 
 
ఈ సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు తమ చిరునామాతో కూడిన గుర్తింపుకార్డుతో పాటు ఆన్‌లైన్‌లో డబ్బులను తితిదే బ్యాంకు ఖాతాలో వేయాలి. ఇందులో ప్రధానమైన విశేషమేమిటంటే తితిదే ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేయగానే అరగంటలోపే సేవా టికెట్లన్నీ అయిపోతాయి. అరగంట తరువాత సేవా టికెట్లన్నీ అయిపోయాయంటూ సర్వర్లలో కనిపిస్తుంటుంది.

వెబ్దునియా పై చదవండి