అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 25228 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 7733 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.
ఈ ట్రేడింగ్లో ఎన్ఎస్ఈ, ఐషర్ మోటార్స్, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. నష్టపోయిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్, విప్రో, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇకపోతే.. పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. రూ.25 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.30,125కు చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అటూఇటూగా ఉన్నా ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరుగుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.