కాంగ్రెస్‌కు షర్మిల మద్దతివ్వడంపై గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం షర్మిల నిర్ణయం కరెక్టేనని టాక్ వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కాంగ్రెస్ గెలుస్తుందా.. లేక బీఆర్ఎస్ గెలుస్తుందా.. అనేది కచ్చితంగా చెప్పడం కాస్త కష్టమే. సరే ఈ విషయాన్ని పక్కనబెడితే.. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్నారు షర్మిల. ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని షర్మిల చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ... కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. కేసీఆర్ ప్యాకప్ చేసుకునే సమయం, ఇంటికి పోయే సమయం వచ్చిందని... ఆయనకు ఎండ్ కార్డ్ పడబోతోందని షర్మిల చెప్పారు. ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటూ... 'బై బై కేసీఆర్' అని రాసి ఉన్న సూట్ కేసును చూపించారు.