ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (09:13 IST)
హైదరాబాద్ నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదిలే రైలు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన ఆ యువతి అటుగా వెళుతున్న పాదాచారుడు గుర్తించి 108కు ఫోన్ చేసి సమాచారం చేరవేశాడు. దీంతో సిబ్బంది అక్కడకు వచ్చి ఆ యువతిని రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. 
 
ఈ యువతి మేడ్చల్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తుకుంటూ జీవిస్తుంది. ఈ క్రమలో సికింద్రాబాద్‌లో తన మొబైల్ ఫోనును రిపేర్ చేయించుకుని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి చెక్డ్ షర్డ్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని, సుమారు 25 యేళ్ల వయసు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ రెడ్డి తెలిపారు. 

 

MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!

తప్పించుకోవడానికి రైలులో నుంచి కిందికి దూకిన యువతి

తీవ్ర గాయాలతో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన యువతి

అటుగా వెళ్తున్న పాదచారుడు 108కు సమాచారం ఇవ్వడంతో గాంధీ హాస్పిటల్‌కి తరలింపు

బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు… https://t.co/fiL19cWoO6 pic.twitter.com/8wmziQ3sjf

— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు