ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఠాగూర్

ఆదివారం, 13 అక్టోబరు 2024 (09:39 IST)
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలలు పాటు జైలు జీవితం గడిపిన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనను గత పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో మృతి చెందారు. 
 
మావోలతో సంబంధాలు ఉన్న ఆరోపణల కారణంగా సుధీర్ఘకాలం పాటు జైల్లో ఉన్న సాయిబాబాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దీంతో గత మార్చి 7వ తేదీన ఆయన నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్  జైలు నుంచి విడుదల చేశారు. 
 
ముఖ్యంగా గడ్చిరోలి ట్రయల్ కోర్టు సాయిబాబాతో పాటు ఐడుగురికి జీవితఖైదు విధించింది. దీంతో 2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే ఆయన అనారోగ్యం బారినపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు