హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ చార్జీలు పెరగనున్నాయి. కొత్తగా పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి రోజూ మెట్రో రైళ్లలో లక్షలాది మంది నగర వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి మెట్రో రైళ్లలో చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన చార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
తొలి రెండు స్టేషన్ల వరకు ప్రయాణ కనీస చార్జీ రూ.12గా నిర్ణయించగా, 2 నుంచి 4 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రూ.18, 6 నుంచి 9 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.30, 9 నుంచి 12 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.50, 12 నుంచి 15 స్టేషన్ల వరకు రూ.55, 15 నుంచి 18 స్టేషన్ల వరకు రూ.60, 18 నుంచి 21 స్టేషన్ల వరకు రూ.66, 21 నుంచి 24 స్టేషన్ల వరకు రూ.70, 24 స్టేషన్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టయితే రూ.75గా నిర్ణయించారు.