విషపూరిత మొక్కజొన్న మొక్కలు తిని 30 జింకల మృత్యువాత

శనివారం, 6 ఆగస్టు 2016 (15:52 IST)
విషాహారం తిని 35 జింకలు మృత్యువాత పడ్డ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం, గుమ్మడం గ్రామంలో పొలంలో జల్లి ఉంచిన క్రిమిసంహారకాలతో కూడిన విషపూరిత మొక్కజొన్నలను మేతకై వచ్చిన 30 జింకలు తిని మరణించాయి. మొక్క జొన్నలు తిన్నఅనంతరం కొంత దూరం వెళ్లాక అవి మరణించాయని గ్రామస్థులు అన్నారు. 
 
దీంతో గ్రామస్థులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది విచారణ చేపట్టింది. చనిపోయిన జింకల మృతదేహాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గ్రామస్థులపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి