ముఖ్యంగా, సికింద్రాబాద్‌తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడుపుతామని తెలిపింది. పండగ రద్దీని నివారించేందుకు ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు ఇవి అదనమని తెలిపింది. ఈ రైళ్లు జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆయా నగరాల మధ్య నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రాత్రి వేళ బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లను నడుపుతామన్నారు. ఇందులో జనరల్, రిజర్వుడ్, ఏసీ బోగీలు ఉంటాయని తెలిపారు. కాగా, సంక్రాంతి కోసం ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇపుడు ప్రకటించిన ప్రత్యేక రైళ్ళతో కలుపుకుని మొత్తం ప్రత్యేక రైళ్ల సంఖ్య 124కు చేరింది.