ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కొన్ని అక్రమాలను నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనం జమ చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అక్రమాలకు చెక్ పెట్టినట్లయింది.
జాతీయ సగటుతో పోలిస్తే... ఈ రెండు అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అయితే.. ఆధార్ అనుసంధానం అయిన కూలీలకే ఏప్రిల్ నుంచి చెల్లింపులు చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల స్పష్టం చేయడంతో రాష్ట్రం లక్ష్యం చేరుకునే దిశగా ముందుకెళ్తోంది. నమోదు ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.