కరోనా వైరస్ ఎపెక్ట్, తెలంగాణలో ఏ ఉద్యోగి జీతంలో ఎంత తగ్గింపు?

మంగళవారం, 31 మార్చి 2020 (14:12 IST)
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 
 
ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం తగ్గింపు విధిస్తారు.
 
ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం తగ్గింపు విధిస్తారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం తగ్గింపు విధిస్తారు. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం తగ్గింపు విధిస్తారు.
 
అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం తగ్గింపు విధిస్తారు. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 10 శాతం తగ్గింపు విధిస్తారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో తగ్గింపు వుంటుంది. ఈ తగ్గించిన మొత్తాన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి చెల్లిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు