లాక్ డౌన్‌కు ముందు మొత్తం 4 లక్షల మంది ప్రజలు అన్ని కారిడార్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా వైరస్ పరిస్థితి కారణంగా రెవెన్యూ రోజుకు 70,00 నుండి 80,000కు పడిపోయింది. అన్ని మెట్రో స్టేషన్లోని శానిటైజేషన్ పనులు కూడా నష్టాల్లో ముంచాయి. ఈ పరిస్థితిలో కొంత మంది కోసం మెట్రోను నడపడం తీవ్ర నష్టాన్ని గురిచేస్తున్నది. మొత్తం 160 రోజులు మెట్రోను నిలపడం వల్ల హైదరాబాద్‌లో మెట్రోకు రూ.260 కోట్లు నష్టం వాటిల్లింది.