రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ - సమస్యలు వింటున్న గవర్నర్

శుక్రవారం, 10 జూన్ 2022 (15:58 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై కక్ష కట్టడంపై ఆమె గుర్రుగా ఉన్నారు. మరోవైపు, ఇవేమీ పట్టించుకోని ఆమె తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తాజాగా రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారు. 
 
దీనికి అనేక మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఈ ప్రజా దర్బార్ కోసం 300 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చిన మహిళలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. 
 
అయితే, దర్బార్‌కు హాజరైన మహిళలను ఉద్దేశించి గవర్నర్ తెలుగులోనే తొలుత ప్రసంగించారు. మహిళల కోసం తన పని తాను చేస్తానని చెప్పారు. ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని తాను సహించబోనని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు