కేరళ ఫ్రెండుకి భార్య స్నాన దృశ్యాలను షేర్ చేస్తున్న భర్త... అతడు కూడా...

గురువారం, 22 జూన్ 2017 (20:04 IST)
భార్య మానప్రాణాలను రక్షించాల్సిన భర్తే విచక్షణ మరిచి విపరీత ప్రవర్తనతో ఏ భర్త చేయని పని చేశాడు. కేరళకు చెందిన తన స్నేహితుడు చెన్నైలో నివాసం వుంటున్నాడు. అతడికి తన భార్య స్నానం చేస్తున్నప్పుడు, తనతో శృంగారం చేసినప్పటి సన్నివేశాలను చిత్రీకరించి వాటిని పంపిస్తూ విక్రుతానందం పొందాడు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని నగరంలో ఓ మహిళ తన భర్త దారుణమైన ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తమ పడకగది విషయాలను తన భర్త తన స్నేహితుడికి షేర్ చేస్తున్నారంటూ పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త కృష్ణ చైతన్యను అదుపులోకి తీసుకుని అతడి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ఇద్దరు స్నేహితులు పరస్పరం తమతమ భార్యల నగ్న వీడియోలను షేర్ చేసుకుంటున్నట్లు తేలింది. దీనితో పోలీసులు చెన్నైలో వున్న కృష్ణచైతన్య స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు బయలుదేరి వెళ్లారు.

వెబ్దునియా పై చదవండి