పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బాధితుడు రైల్వేలో టెక్నికల్ విభాగంలో పనిచేసి రిటైర్డు అయ్యాడు. మూడు నెలల కిందట బాధితుడికి ఫోన్ చేసి.. తాము ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాని చెప్పి రూ.53 వేల విలువైన పాలసీని చేయించారు. తర్వాత ఫోన్ చేసి ఆ పాలసీ కంటే ప్రీమియం ఎక్కువగా వచ్చేది మరొకటి ఉందని, మీకు త్వరగా పాలసీ డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.
ఆ విశ్రాంత ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులను మూడు నెలల కాలంలో 8 బ్యాంకు ఖాతాల్లో రూ.21 లక్షలు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు డిపాజిట్ చేశాడు. తీరా ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గ్రహించి బుధవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.