ఈ వివరాలను పరిశీలిస్తే, చైతన్యపురికి చెందిన 33 యేళ్ల వ్యక్తి ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చేరవేశారు. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైనశైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఈ క్రమంలో తన భర్తకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో తన ప్రియుడుతో కలిసి ఆ మహిళ హత్యకు ప్లాన్ చేసింది. శనివారం రాత్రి మద్యంలో విషం కలిపి ఇచ్చింది. ఇది సేవించిన ఆ వ్యక్తి అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముక్కు, నోటిపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు.