వివాస్పదంగా మారిన యాంకర్ అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్

గురువారం, 16 ఆగస్టు 2018 (15:02 IST)
న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఎంటర్టైన్‌మెంట్ యాంకర్‌గా టర్న్ తీసుకుని సక్సెస్ సాధించింది. ఆ తరువాత సినీ రంగంపై దృష్టి పెట్టిన అనసూయ రంగస్థలం సినిమా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడ ఆమె ఓ సెలబ్రిటి. సెలబ్రిటీలను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ పిలవడం ఆనవాయితీగా వస్తోంది. భువనగిరి వివేరా హోటల్‌లో జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమానికి రమ్మంటూ అనసూయకు ఆహ్వానం అందింది.
 
అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్‌కు వెళ్లి వివేరా హోటల్లో జెండా ఎగరవేసింది. ఆ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వివాదాస్పదంగా మారి వైరల్ అయింది. టీ షర్ట్, గళ్ళుగళ్ళు ఉన్న లాంగ్ స్కర్ట్ వేసుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం ఏంటని కొంతమంది ట్విట్టర్లో విమర్శించడం మొదలుపెట్టారు. మరికొందరు మాత్రం అనసూయకు మద్దతు తెలిపారు. అనసూయ ఎగరవేసిన ఫ్లాగ్ హోస్టింగ్ ఇలా వివాదానికి దారితీసిందన్నమాట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు