తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలు ఎలాంటి కష్టం ఎదుర్కొంటున్నారో... ఏయే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఇట్టే పట్టేస్తుంటారు. ఈ వ్యవహారంపై మొహమాటం లేకుండా అధికారులకు చురకలు అంటిస్తూ చెప్పేస్తారు. తాజాగా నోట్లు రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపుకు ప్రజలను మళ్లించాలన్న ఉద్దేశ్యాన్ని కేసీఆర్ ఆహ్వానించారు. అలాగే ఈ పద్ధతి సక్సెస్ కావాలంటే బ్యాంకులు తమతమ సర్వర్ల కెపాసిటీని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ప్రజలు తాము స్వైప్ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటపుడు సర్వర్ మొరాయిస్తే చిరాకెత్తిపోతుందనీ, అలాంటి పరిస్థితి తలెత్తితో ఈ పద్ధతి పట్ల ఆసక్తి చూపరని వెల్లడించారు. కాగా మొబైల్ ద్వారా లావాదేవీలు చేయాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చినా ప్రజలు మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీనికి కారణం మొబైల్ ఫోన్లలో అందుకు తగినట్లు ఫీచర్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.