వృద్ధుడికి కేసీఆర్ సాయం అంతా బూటకం: రేవంత్ రెడ్డి ఫైర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (19:00 IST)
నిన్న కెసిఆర్ సలీమ్ అనే వృద్ధుడుని కలిసి తన వ్యక్తిత్వం చాటుకున్నారు అని పత్రికలలో వచ్చిన కథనం ఓ పెద్ద నాటకం అని కెసిఆర్ పైన ఘాటైన విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కొడుకు ఊళ్లు తిరుగుతుంటే తండ్రి హైదరాబాదులో తిరుగుతూ సురభి నాటకాన్ని తలపిస్తున్నాయి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వైఫల్యాలపై మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్‌ను సందర్శించి స్థానిక మహిళలతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్లో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది వాటి పైన అధికారులు నివేదిక సమర్పించాలి అని ఆదేశించారు. 
 
కైతలాపూర్ లోని 140 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ముందుగా స్థానిక నివాసితులకు అందించాలని ఆయన అన్నారు. రెండు నెలల్లో వీటి పైన చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి అక్కడే వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తామని  తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు