తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా గవర్నర్ మార్పు జరిగిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇకపై తెలంగాణా సర్కార్ పని నల్లేరుపై నడక అన్న ప్రచారం జరుగుతోంది. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని తెలంగాణా గవర్నర్‌గా పంపిస్తున్నారంటే పార్టీ బలోపేతానికేనన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. కొత్త గవర్నర్‌గా వస్తున్న సౌందర్ రాజన్ తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరుణానిధి కుమార్తె కనిమొళిపై పోటీ చేశారు.
తమిళనాడు లాంటి రాష్ట్రంలో బిజెపి బలోపేతం కూడా కృషి చేశారు సౌందర్ రాజన్. చెప్పుకోదగ్గ స్థాయిలో సభ్యత్వం చేయించారు. అక్కడి సమస్యలపై తన పోరాటం చేశారు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చి బిజెపిలో అంచెలంచెలుగా ఎదిగారు. దీన్నిబట్టి ఆమె సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సౌందర్ రాజన్ కామ్‌గా వచ్చి గవర్నర్‌గా ఉంటారంటే అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.