తెలంగాణాలో ఆత్మహత్యలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మ, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ఆత్మహత్య ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రభుత్వ అధికారులను నివేదిక కోరారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 
 
ఇటీవల ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేష్, కామారెడ్డి జిల్లాలో తల్లీ కుమారుల ఆత్మహత్యల ఘటనలు సంభవించాయి. ఇవి రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. అయితే, ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదా సానుభూతిపరులని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం తెరాస నేతల వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై వారు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
 
ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఆత్మహత్యల ఘటనపై గవర్నర్ తమిళిసై సమగ్ర నివేదిక కోరారు. అలాగే, ప్రైవేటు వైద్య కాలేజీలకు పీజీ సీట్లను బ్లాక్ చేసి అడ్దదారిలో విక్రయిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కూడా నివేదిక కోరారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీని ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు